పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్ | Minor gang-raped in UP | Sakshi
Sakshi News home page

పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్

Apr 2 2015 12:41 PM | Updated on Aug 1 2018 4:24 PM

పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్ - Sakshi

పొలంలో బాలికపై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్ సీతాపూర్లోని బిశ్వా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది.

లక్నో:  ఉత్తరప్రదేశ్ సీతాపూర్లోని బిశ్వా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. అయితే గడ్డి కోసేందుకు పొలానికి  వెళ్లి యువతి సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఆ క్రమంలో ఆమె కోసం గాలింపు చేపట్టారు. దాంతో బాలిక పొలంలోకి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను ఇంటికి తరలించారు. జరిగిన సంఘటనను యువతి కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల్లో ఒకరైనా రోహిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement