మన్మోహన్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: బీజేపీ | Manmohan Singh should himself offer to depose before CBI in the Coal Gate: BJP | Sakshi
Sakshi News home page

మన్మోహన్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి: బీజేపీ

Sep 4 2013 4:40 PM | Updated on Sep 1 2017 10:26 PM

బొగ్గు గనుల కేటాయింపుల కేసులో ప్రధాని మన్మోహన్ సింగ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

బొగ్గు గనుల కేటాయింపుల కేసులో ప్రధాని మన్మోహన్ సింగ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తనకు తానుగా సీబీఐ ఎదుట హాజరుకావాలని సూచించింది. కోల్గేట్ కుంభకోణం దర్యాప్తు పైళ్లు గల్లంతుపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని లోక్సభలో ఆమె లేవనెత్తారు.

ఫైళ్లు దొంగతనానికి గురయ్యాయని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఆమె అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే ఏదో దాస్తుందని అర్థం చేసుకోవాల్సివుంటుందని పేర్కొన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాని వద్ద ఉన్నప్పుడే కోల్ గేట్ స్కామ్ జరిగింది కాబట్టి ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement