మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సైదాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సైదాబాద్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సైదాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ డివిజన్ సెంట్రల్ బస్తీకి చెందిన మద్దిబోయిన అశోక్ బ్యాంకు ఉద్యోగిగా పని చేసి పదవీవిరమణ పొందారు.
ఇంటి పక్కనే ఉన్న మహిళ పట్ల ఇతను గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె భర్త సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.