దర్శకురాలి భర్తకి జీవితఖైదు! | Mahmood Farooqui rape case, Delhi police seeks maximum punishment | Sakshi
Sakshi News home page

దర్శకురాలి భర్తకి జీవితఖైదు!

Aug 2 2016 6:47 PM | Updated on Jul 28 2018 8:40 PM

దర్శకురాలి భర్తకి జీవితఖైదు! - Sakshi

దర్శకురాలి భర్తకి జీవితఖైదు!

అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్‌’ సినిమా సహా దర్శకుడు మహమూద్‌ ఫారుఖీకి జీవితఖైదు విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు.

న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్‌’  సినిమా సహా దర్శకుడు మహమూద్‌ ఫారుఖీకి జీవితఖైదు విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఫారుఖీని ఇప్పటికే దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. నిందితుడికి ఈ నెల 4న శిక్ష విధించనున్నట్టు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సంజీవ్‌ జైన్‌ తెలిపారు.

దోషిగా తేలిన ఫారుఖీకి శిక్ష విధింపుపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున ప్రాసిక్యూషన్‌ లాయర్‌ వాదనలు వినిపిస్తూ దోషికి గరిష్ట శిక్ష అయిన జీవితఖైదు విధించాలని జడ్జిని కోరారు.

గత ఏడాది మార్చిలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ లైంగిక దాడి ఘటన జరిగింది. తనపై ఫారుఖీ అత్యాచారం జరిపినట్టు కొలంబియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రీసెర్చ్‌ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్‌ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం జరిపాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ పేర్కొన్నాడు. గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్‌ మూవీ ‘పీప్లిలైవ్‌’కు ఫారుఖీ సహ దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement