
ఇటు బల్లెం.. అటు బ్యాట్
ఒక చేత్తో బల్లెం.. మరో చేత్తో బ్యాట్.. ఏంటీ విచిత్రం? ఈ అడవి పుత్రులకు క్రికెట్ ఆటతో సంబంధమేంటి? అదేగా మీ ప్రశ్న.. వీళ్లు క్రికెటర్లు. వీరి టీం పేరు మాసాయ్ క్రికెట్ వారియర్స్.
ఒక చేత్తో బల్లెం.. మరో చేత్తో బ్యాట్.. ఏంటీ విచిత్రం? ఈ అడవి పుత్రులకు క్రికెట్ ఆటతో సంబంధమేంటి? అదేగా మీ ప్రశ్న.. వీళ్లు క్రికెటర్లు. వీరి టీం పేరు మాసాయ్ క్రికెట్ వారియర్స్. వీళ్ల టీం దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ట్వంటీట్వంటీ మ్యాచ్‌లూ ఆడింది. అదీ ఈ గెటప్‌లోనే.. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత వినూత్న టీంగా పేరు గాంచింది. అడవుల్లో బతికే వీరికి క్రికెట్ ఫీవర్ ఎప్పుడు పట్టుకుందంటే.. మనం ఆలియా గురించి చెప్పుకోవాలి. దక్షిణాఫ్రికాకు చెందిన ఈమె అడవి జంతువులపై పరిశోధన కోసం కెన్యాకు వచ్చారు. ఆమెకు క్రికెట్ అంటే తెగ పిచ్చి. ఇక్కడేమో చాన్స్ లేదు? మరేం చేయాలి. బ్యాట్, బాల్ తెప్పించి.. స్థానిక మాసాయ్ గిరిజనులకు క్రికెట్ నేర్పించారు. వాళ్లకూ నచ్చింది. కొన్నాళ్లకు ఓ క్రికెట్ టీంగా తయారయ్యారు.