రాణి అయితే.. నాకేంటి? | "little" bitter experience to Queen Elizabeth 2 | Sakshi
Sakshi News home page

రాణి అయితే.. నాకేంటి?

Mar 10 2017 11:42 PM | Updated on Jul 12 2019 3:02 PM

రాణి అయితే.. నాకేంటి? - Sakshi

రాణి అయితే.. నాకేంటి?

తీరా ఆమె వెళ్లాక మళ్లీ ముసిముసి నవ్వులు నవ్వాడు.

లండన్‌: క్వీన్‌ ఎలిజబెత్‌... ఈమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ రకంగా ఆమె బ్రిటన్‌కే కాదు.. ప్రపంచానికే రాణి. ఎందుకంటే ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు ఒకప్పుడు బ్రిటన్‌ పాలనలోనే ఉండేవి. అలాంటి రాణికి బొకే ఇచ్చే అవకాశమే వస్తే... నిజానికి రాదనుకోండి.. ఒకవేళ వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదూ! కానీ అల్ఫీ లన్‌ మాత్రం.. అందుకు ససేమిరా అన్నాడు. ఎందుకు.. అనే కదా మీరు అడుగుతోంది. నిజానికి తాను బొకే ఎందుకు ఇవ్వనన్నాడో బహుశా అల్ఫీకి కూడా తెలియదనుకుంటా. వివరాల్లోకెళ్తే..

అల్ఫీ లన్‌ అనే రెండేళ్ల బుడతకి బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌కు బొకే ఇచ్చే అవకాశం వచ్చింది. రాణి వచ్చే సమయానికి పిల్లాణ్ని ఎత్తుకొని తల్లి సిద్ధంగా ఉంది. రాణి రావడంతోనే బొకే ఇవ్వాలని కూడా చెప్పింది. ముందు బాగానే తల ఊపిన అల్ఫీ.. తీరా రాణి దగ్గరకు వచ్చేసరికి ఏడుపు లంఘించుకున్నాడు. అంతటితో ఆగాడా... తల్లి చేతుల్లో నుంచి కిందకు దిగి బొకే ఇవ్వనంటూ మారం చేశాడు. తల్లి ఎంతగా బతిమాలినా ససేమిరా అన్నాడు. దీంతో తల్లి బలవంతంగా చేయి పట్టుకొని బొకే ఇప్పించింది. దీంతో క్వీన్‌ ఎలిజబెత్‌ నవ్వుకుంటూనే బొకే తీసుకొని అక్కడి ఉంచి వెళ్లిపోయింది. తీరా ఆమె వెళ్లాక మళ్లీ ముసిముసి నవ్వులు నవ్వాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement