ఎల్ జీ నుంచి రెండు డిస్ ప్లే ల ఫోన్
ఎల్ జీ కొత్తగా రెండు డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల ముగింటకు తీసుకురాబోతోంది.
	స్మార్ట్ ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లను చూసుకోవడానికి, ఏదైనా ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు దాన్ని ఆపివేసి మరీ నోటిఫికేషన్లు యూజర్లు చూసుకోవాల్సి ఉంటోంది. అయితే ఈ ఆటంకం నుంచి వినియోగదారులు బయటపడేందుకు, రన్నింగ్ ప్రోగ్రామ్ కు ఎలాంటి అవాంతరాలు  లేకుండా ఉండేందుకు ఎల్ జీ కొత్తగా రెండు డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల ముగింటకు తీసుకురాబోతోంది. జూలై 18న ఎక్స్ స్క్రీన్ పేరుతో ఈ ఫోన్ ను ఆవిష్కరించబోతోంది. ఈ ఈవెంట్ కు మీడియా ప్రతినిధులను ఎల్ జీ ఆహ్వానం పలుకుతోంది.
	ఇటీవలే కే సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఎల్ జీ మార్కెట్లోకి ఆవిష్కరించింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆఫరింగ్ లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి ఎక్స్ స్క్రీన్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఎల్ జీ ప్రకటించింది. రెండో స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్ లో ఉండేలా ఈ ఫోన్ రూపొందింది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వెంటనే రెండో డిస్ ప్లేలో యూజర్లు ఈ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు.
	
	ఎల్ జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు..
	4.93 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
	రెండో డిస్ ప్లే 1.76 అంగుళాలు
	520 x 80 పిక్సెల్స్
	క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్
	2 జీబీ ర్యామ్
	16 జీబీ స్టోరేజ్
	7.1 ఎంఎం థిక్
	120 గ్రాముల బరువు
	13 ఎంపీ వెనుక కెమెరా
	8 ఎంపీ ముందు కెమెరా
	2300 ఎంఏహెచ్ బ్యాటరీ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
