వరుస దొంగతనాలతో దోపీడీ దొంగలు ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చివరకు ఈ దొంగల బెడద దేవాలయాలకు తాకింది.
కోరుట్ల: వరుస దొంగతనాలతో దోపీడీ దొంగలు ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. చివరకు ఈ దొంగల బెడద దేవాలయాలకు తాకింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆలయంలో దొంగలు చేతివాటం చూపెడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒకే ఆలయంలో గత నాలుగు నెలల్లో వరుసగా ఏడోసారి దొంగతనం జరగడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది.
కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలోని శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మరోసారి దొంగలు పడడంతో వార్తల్లోకిక్కెంది. సోమవారం అర్థరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు అమ్మవారి వెండి ఆభరణాలతోపాటు హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన పూజారి విషయం గ్రహించి, స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఆలయంలో గత నాలుగు నెలల్లో ఇది ఏడో దొంగతనం కావటం గమనార్హం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.