నీది కల్తీలేని అవకాశవాదం | KTR takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

నీది కల్తీలేని అవకాశవాదం

Nov 29 2013 3:20 AM | Updated on Aug 11 2018 7:30 PM

నీది కల్తీలేని అవకాశవాదం - Sakshi

నీది కల్తీలేని అవకాశవాదం

తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి కల్తీలేని, నిఖార్సయిన పచ్చి అవకాశవాదానికి పరాకాష్ట అని టీఆర్‌ఎస్ నేత కే తారక రామారావు విమర్శించారు.

చంద్రబాబుకు కేటీఆర్ బహిరంగ లేఖ
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి కల్తీలేని, నిఖార్సయిన పచ్చి అవకాశవాదానికి పరాకాష్ట అని టీఆర్‌ఎస్ నేత కే తారక రామారావు విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.

 

‘ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆ నిర్ణయం తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై కల్లబొల్లి విమర్శలు చేయడం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు సహకరించడం.. ఈ పద్దతుల ద్వారా రాజకీయాల్లో పచ్చి అవకాశవాదానికి, కొత్తరకం మోసాలకు చంద్రబాబు తెరతీశారని కేటీఆర్ విమర్శించారు. ‘రాజకీయాల్లో తలలు పండిపోయిన నేతలకు ఎలాంటి రాజకీయ అనుభవంలేని లోకేశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వారసత్వ రాజకీయం కాదా’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement