ఈ నెల 6వ తేదీ నుంచి ఢిల్లీలో కొరియా చలన చిత్రోత్సవం | Korean film festival comes to Delhi from december 6th | Sakshi
Sakshi News home page

ఈ నెల 6వ తేదీ నుంచి ఢిల్లీలో కొరియా చలన చిత్రోత్సవం

Dec 2 2013 6:01 PM | Updated on Aug 13 2018 4:19 PM

ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు నగరంలో కొరియా చలన చిత్రోత్సవం సాగనుంది.

న్యూఢిల్లీ:ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు నగరంలో కొరియా చలన చిత్రోత్సవం సాగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్... సినీ దర్బార్ ఫిల్మ్ క్లబ్ సహాకారంతో ఈ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు సాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జూన్-హో బోంగ్ దర్శకత్వంలో రూపొందిన ‘బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్’ అనే చిత్రంతో ప్రారంభమవుతుందని సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

మూడు రోజుల్లో మొత్తం ఏడు చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చాంగ్-డాంగ్ లీ, సీక్రెట్ సన్‌షైన్, ఇక్-జూన్‌యాంగ్ ‘బ్రిత్‌లెస్’, జిన్-హో హుర్ ‘క్రిస్ట్మస్ ఇన్ ఆగస్టు’ చిత్రాలు ప్రదర్శిస్తారు. ప్రధానంగా హస్య, శృంగార  చిత్రాలుగా ఉంటాయని, వీటిలో భారతీయులు పునర్నిర్మించిన కొరియా చిత్రాలు కూడా ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement