తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారకులైనవారికి మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేసింది.
కోల్‌కతా: తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారకులైనవారికి మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. పోలీసులు తమను నగరం వదిలిపెట్టి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని, తమకు భద్రత కల్పించాలని కోరింది. బీహార్‌కు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ కుమార్తె(16)పై గతేడాది అక్టోబర్ 25న ఆరుగురు యువకులు రెండుసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
డిసెంబర్ 23నబాధితురాలు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం మృతిచెందింది. మృతదేహంతో కుటుంబసభ్యు లు బుధవారం ర్యాలీ నిర్వహించాలని భావించగా, మార్చురీలో ఉన్న మృతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు యత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబం గవర్నర్‌ను కలిసింది. బాధితురాలి మృతదేహానికి మధ్యాహ్నం అంత్యక్రియలు చేశారు.