ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే! | Kids of smokers may carry nicotine on their hands: study | Sakshi
Sakshi News home page

ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే!

Apr 10 2017 8:09 AM | Updated on Sep 5 2017 8:26 AM

తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు.

వాషింగ్టన్‌ : తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్‌ కారక నికోటిన్‌ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు.

సిన్సినాటీ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్‌ కారక నికోటిన్‌ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement