ఆపిల్ను వీడిన కీలక అధికారి | Key Enterprise Executive Leaves Apple | Sakshi
Sakshi News home page

ఆపిల్ను వీడిన కీలక అధికారి

Feb 8 2017 4:53 PM | Updated on Aug 20 2018 2:58 PM

ఆపిల్ను వీడిన కీలక అధికారి - Sakshi

ఆపిల్ను వీడిన కీలక అధికారి

టెక్ దిగ్గజం ఆపిల్కు ఓ కీలక ఉన్నతాధికారి గుడ్బై చెప్పారు.

టెక్ దిగ్గజం ఆపిల్కు ఓ కీలక ఉన్నతాధికారి గుడ్బై చెప్పారు.  సంస్థకు ప్రభుత్వానికి వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తున్న జాన్ సోలమన్ కంపెనీను వీడినట్టు ఆపిల్ మంగళవారం వెల్లడించింది. ఆపిల్  ఉత్పత్తులను ఇతర కీలక వ్యాపారాలకు, ప్రభుత్వ సంస్థలకు సోలమన్ విక్రయిస్తుంటారు. హెచ్పీ ఇంక్ ఎగ్జిక్యూటివ్గా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సోలమన్ను  ఆపిల్ 2015లో కంపెనీలో నియమించుకుంది. అప్పటినుంచి సోలమన్ సంస్థకు, ప్రభుత్వానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
 
అయితే ఆయన సంస్థను వీడినట్టు ధృవీకరించిన ఆపిల్, మిగతా విషయాలు వెల్లడించడానికి నిరాకరించింది. ఆయన ఎందుకు కంపెనీకి గుడ్బై చెప్పారో కూడా తెలుపులేదు. అయితే సోలమన్ వైదొలగడం  ఆపిల్ సంస్థ వ్యాపారాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియరాలేదు. ఐబీఎం భాగస్వామ్యంతో కంపెనీ తన ఉత్పత్తులను అత్యధికంగా పెద్ద పెద్ద బిజినెస్లకు విక్రయిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement