breaking news
departure
-
ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా నాలుగేళ్లుగా అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెర్మినల్ భవనంలో కొనసాగించారు. గతంలో ఉన్న డిపార్చర్ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన కొత్త భవనం ఇటీవల పూర్తయింది. దీంతో ప్రధాన టెర్మినల్‌లోనే కొత్త అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈవో ప్రదీప్ ఫణీకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం తొలిసారిగా కొత్త టెర్మినల్ కేంద్రంగా బయల్దేరింది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం పురోగమిస్తోందని సీఈవో ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
Shamshabad: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు
శంషాబాద్: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్ నుంచే అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..) -
మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!
మొదటి సారి చదివి గొప్పగా ఉందిగా! అని అనుకున్న పుస్తకాన్ని, తొలిసారి చూసినపుడు అతి గొప్పది అనుకున్న సినిమాని , కలిసిన తొలిసారి ఒక అద్భుత వ్యక్తిని తెలుసుకున్నామనుకుని భ్రమించి. మళ్ళీ కలిసిన మరోసారి వీడేనా అవ్వాడు అనుకోవడం, ఇదేనా ఆ పుస్తకం! ఆ చిత్రరాజం ! అని నిరుత్సాహ పడిపోవడం అత్యంత సహజం. అంతే అది . ఆప్పుడెపుడో చదివిన గొప్ప పుస్తకం, ఎప్పుడో చూసిన ఒక సినిమా, రోజూ కలిసే అదే మనిషి- ఎప్పుడు , ఎన్నిసార్లు చూసినా, చదివినా, కలిసినా గొప్పగా అనిపించేలా చేసేవి చాలా తక్కువ మాత్రమే అంతే గొప్పగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తమలోని గొప్పని ఇంకా గొప్పగా ప్రతిసారి మనముందు ఆవిష్కృతమవుతాయి. కాదు అవి అలాగే ఉంటవి, మనం ఆ గొప్పని ప్రతిసారీ గొప్పగా చూస్తాము అని అనుకుంటాను. ఇప్పుడు చెప్పబొయే ఈ ‘డెపార్చర్స్’ అనే సినిమాని నేను పదికి పైగా సంవత్సరాల మునుపు చూసా. అప్పుడు కదిలి పోయా, ఎంతలా కదిలి పోయానో ఇప్పుడు గుర్తు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే నిలువెల్లా దుఃఖంలో నిండి స్వచ్చమైన దుఃఖపు నీరులా మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా ఇది. ఇంకో పదేళ్ల తరువాతయినా మళ్ళీ ఈ సినిమా చూసినపుడు అప్పుడు నాలో చెమ్మ మొత్తం ఇంకిపోయినా ఈ సినిమా ఆ నీటిని తిరిగి ఊరేలా చేస్తుందనే నమ్మకమే ఉంది. ఎలా చెప్పను ఈ సినిమా కథను మీకు? ప్రాణాలు కోల్పోయిన మనుషులని సైతం ప్రాణమున్న సీతాకోకచిలుక రెక్కలు తాకబోయినంత మృదువుగా తాకి అంతిమ వీడ్కోలు చెప్పే మనుషుల కథ ఇది. మన జీవితాలలో మనం ఎప్పటికీ ఎరుగని కొంతమంది అజ్ఞాత వ్యక్తుల కథ ఇది. ఎండుగట్టి కర్రలాగానూ, చల్లని మంచు రాయిలాగూను మారిన మన తండ్రినో, తల్లినో మిత్రుడినో, ఆత్మ బంధువు మృతదేహాన్ని మనం నిలువెల్లా శుభ్రం చేయగలమా? పంటి చిగుళ్ళు రుద్దడానికి ఈ వ్రేళ్ళకొసలు ఆ దంతాల అన్ని చివరలకు చేరగలవా? మాలద్వారం వద్ద అట్టగట్టిన ఆ కశ్మలాన్ని ఈ చేతుల వేళ్ళు తొలగించగలవా? ఆ దేహం మూలమూలలా మిగిలి ఉన్న మురికిని పారద్రోలేంత మెత్తగా ప్రేమగా ఒక అంతిమ స్నానం చేయించగలమా మనం? ఇంత ఎందుకు? అసలు చివరి ఊపిరి పోగానే సమస్తం రద్దు చేయబడిన ఆ మనిషిని ‘శవం’ అని కాకుండా ఇంకా మన మధ్య ఉన్న వారిలాగే అదే పేరుతో, బంధుత్వంతో, అనురాగంతో పిలవగలమా? సహించగలమా? వహించగలమా? ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోబయాషి మరియూ అతని భార్య మికా కొబయాషి ఇరువుతూ తమకు వచ్చిన గడ్డు రోజుల కాలంనుండి సినిమా మొదలవుతుంది. కోబయాషి ఒక యువ సంగీత వాయిద్యకారుడు. తను పనిచేస్తున్న సంగీత వాద్యబృందం ఆర్థిక సంక్షోభం వల్ల మూతపడుతుంది. ఉద్యోగం లేకుండా టోక్యో వంటి మహనగరంలో ఉండి భవిష్యత్తుని మళ్ళీ సంగీతంలోనే వెదుకోవడం కష్టమనిపించి భార్యతో కలిసి తన స్వంత ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కథానాయకుడు. ఊర్లో కనీసం స్వంత ఇల్లు ఉంది. తల్లి రెండు సంవత్సరాలక్రితమే మరణించింది. అంతకు మునుపు తల్లి తన ఇంట్లోనే చిన్న హోటల్ నడిపేది. కోబయాషి తండ్రి ఈ పిల్లాడి చిన్నతనంలోనే ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. అదంతా వేరే కథ. కానీ సినిమాలో గొప్పగా మనకు చెప్పిన కథే ఇదంతా , అదంతా సినిమా చూసి తెలుసుకుందురు . కానీ గమనిస్తే ఒకటనిపిస్తుంది మనకై మనం ’జీవితం’ ఇది అని, ఇలా ఉండాలని ఒకలా నిర్ణయించుకుంటాం. మన నిర్ణయాలతో జీవితానికి పని ఏం ఉంది. దాని దావన అది వెడుతూనే ఉంటుంది. చచ్చేవరకు -చచ్చినట్లు మనం దాని వెనుక నడవలసిందే. కొబయాషి చిన్నపిల్లాడుగా ఉన్నప్పటినుండి సంగీతమే తన జీవితం అనుకున్నాడు, సంగీతం లోనే తన భవిష్యత్తు ఉందని కూడా అనుకున్నాడు. సంగీతం అతనికి తండ్రి రక్తంనుండి అందుకున్న జన్యు సంపద. కానీ ఏవయ్యింది? తను ఏనాడు అనుకోనిది ఒకతి, తన చదువుకున్న చదువు ఇవ్వనిది ఒకటి , తన సంగీత ప్రపంచం ఊహించని ఒక ఉద్యోగం ఒకదానిలో అతను అనుకోకుండా కుదిరిపోవాల్సి వచ్చింది. ఎటువంటి ఉద్యోగం అనుకున్నారు అది? మరణించిన మృతదేహాలను ఖననం చేయడానికి లేదా దహనం చేయడానికి ముందు పరలోక ప్రవేశానికి సిద్ధం చేసే అంత్యక్రియల నిపుణుడు సకాషి అనే ఒక పెద్దమనిషికి సహయకుడి ఉండె ఉద్యోగం అది. (బహుశా మన చుట్టూ ఉన్న రకరకాల జనజాతుల్లో మరణానంతర అంతిమ సంస్కారాల్లో ఈ ఈ సినిమాలో చూపించి నటువంటి ఉన్నత అంతిమ వీడుకోలు సంస్కారపూరిత సాంప్రాదాయం ఉందో లేదో నాకు తెలీదు . మరీ ఇంతగా కాదు కాని చిన్న చిన్న మార్పులతో కొంత వరకు ముస్లీం జీవన విధానంలో వారు మరణించిన అనంతరం జరిపే క్రియాకాండలు చాలా పద్దతిగా, పరిశుభ్రంగా ఉండటం వరకు నేను ఎరుగుదును) ఈ సినిమాలో సకాషి పాత్రను ‘సుటోము యమజక ’ అనే ఒక అద్భుత నటుడు నటించారు. చెప్పుకోవాలంటే ఈయన మన హింది సినిమాల్లో ‘అశోక్ కుమార్’ వంటి వారు . చక్కని రూపు రేఖలు, హుందాతనపు నటన. ఈయన సినిమాలు నేను మునుపు రెండు చూసాను. ఏ టాక్సింగ్ ఉమన్, ఇంకా ‘టాంపొపొ’. రెండూ అద్భుతమైన సినిమాలు. ఈ రెండు సినిమాల దర్శకులు ‘జుజో ఇటామి’ ఈయన గురించి మరెప్పుడయినా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంత గొప్పగా ముచ్చటించుకోవాల్సిన మనిషి ఈతను. తిరిగి ఈ సినిమా దాకా వస్తే, మన ఈ మనుషుల ప్రపంచం ఎట్లా ఏడిచిందో చూశారా? నువ్వు ఎంత పనికిరానివాడివి, పనికి మాలినవాడివి అయినా క్షమిస్తారు. నేరగాడివి, మోసగాడివి, పచ్చి స్వార్థపరుడివయినా, పరాయి సొత్తుకోసం ప్రతి క్షణం కాచుకు కూచునే గుంట నక్కవయినా మన్నిస్తారు కానీ శవాన్ని తాకిని మనిషిగా, శవాన్ని కడిగిన మనిషిగా, శవానికి తలదువ్వి బట్టలు తొడిగి నిర్జీవమైన ఆ పెదాలపై చివరి జీవం లత్తుక అద్దిన వాడివిగా నిన్ను నీ స్నేహితులు, బంధుమిత్రులు అంతా ఒక అంటరానివాడిగా చూస్తారు. అంతదాకా ఎందుకు కేవలం శవదహనానికి వెళ్ళి వచ్చిన నిన్నే అంటక, నీ బట్టలు వదిలించి, నిన్ను తలారా స్నానం చేయించి కానీ నీ స్వంత ఇంటి గడప లోకి రానివ్వరే నీ వారు! అటువంటి నిర్జీవ ప్రపంచంలో ప్రాణం లేని వారితో సాగించే నిత్యౌద్యోగంలో మునిగే తేలే మనుషుల చావు వాసన భరించే వారెవరు? తన ఉద్యోగం ఏవిటో భార్యకు చెప్పకుండా చాలా కాలం కొబయాషి కాలం నడుపుతాడు. నిజం బయట పడిన రోజుని భార్య ‘మికా’ అతడ్ని వదిలి వెల్లి పోతుంది. ఏం కేవలం డబ్బు కోసమేనా అతడు ఆ ఉద్యోగం చేస్తున్నది? అయిష్టంగా, అనుకోకుండా ఆ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, అయినవాళ్లందరు ఛీ, యాక్’ అని ముక్కు మూసుకుని దూరం వెళ్ళిపొయినా. ఆ పనిలోని ఒక లోతుని , ఒక మానవీయతని, ఒక గొప్ప కళని, కరుణని కనుగుంటాడు. అత్యంత ఇష్టంగా అందులో ఉండిపోతాడు. ఈ సినిమా అంతా బాధాపూరిత , వేదనా భరిత ఒకటిన్నర గంటల కాలపు ప్రయాణం అని భావించవద్దు. వేదన ఎక్కడ ఉంటుందో అక్కడ జీవితం సున్నిత తాలూకు హాస్యం ఉంటుంది. ప్రపంచంలో ఎంతటి వేదనాభరిత జీవనంలోనయినా వీలు చిక్కినప్పుడల్లా హాస్యం తొంగి చూస్తూనే ఉంటుంది. అది సాహిత్యంలో కానీయండి. జీవితాలవంటి సినిమాల్లో కానీయండి. ఈ సినిమా లోనూ అదే ఉంది. ఇంతకన్నా ఎక్కువగా సినిమా గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు. నాకు తెలుసు మీ టేస్ట్ గొప్పది మీరు తప్పక ఈ సినిమా చూస్తారని. కొసరు: ఈ సినిమా దర్శకుడి పనితనం, చిన్న చిన్న వివరనైపుణ్యం గురించి బొలెడు చెబుతా మచ్చుకు ఒకటి: సినిమా ప్రారంభంలో, తను పని చేస్తున్న ఆర్గెస్ట్రా రద్దు అయిపోయి ఉద్యోగం పోయిన సంగతి గురించి కోబయాషి తన భార్యకు తెలియజేసిన తరువాత, ఆమె ఆ రాత్రి భోజనం సిద్ధం చేయడానికి వంటగదికి వెళుతుంది అంతకు మునుపే వారి పొరుగింటి వారు ఆ రాత్రి వంటకోసమని ఈ దంపతులకు ఒక ఆక్టోపస్ ఇస్తారు, అది ప్రాణమున్న ఆక్టోపస్. దాన్ని చంపి తినడానికి చేతులు భార్యాభర్తలు ఇరువురు దానిని ఒక కాలువ దాకా తీసుకెళ్ళి దానిని నీటిలోకి విడిచి ఒక కొత్త జీవితాన్ని దానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆక్టోపస్ అప్పటికే చనిపోయినవుంటుంది, ఇంతా చేసీ కోబయాషి నీళ్ళల్లోకి వదిలింది ఒక చనిపోయిన జీవిని. సినిమా మనకు ఈ సన్నివేశం చూపిస్తూ చెప్పి చెప్పకుండానే కోబయాషి భవిష్యత్తులో తను చేయబోయే కొత్త ఉద్యోగమేమిటో ఒక సూచనగా మనకు అందిస్తారు దర్శకులు. - అన్వర్ -
ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి అమెరికన్లు
సాక్షి, శంషాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో శుక్రవారం పలువురు అమెరికన్లు 2 ఎయిరిండియా విమానాల్లో ఇక్కడి నుంచి ముంబై మీదుగా వాళ్ల దేశానికి బయలుదేరారు. మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఏఐ–1615 విమానం 69 మంది పెద్దలు, ఒక శిశువుతో ఇక్కడి నుంచి ముంబైకి బయల్దేరగా.. ఏఐ–1617 విమానం 96 మంది పెద్దలు, ఇద్దరు శిశువులతో సాయంత్రం 4.24 గంటలకు టేకాఫ్ తీసుకుంది. పూర్తి శానిటైజేషన్ చేసిన టెర్మినల్ ద్వారా వీరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు. లాక్డౌన్ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్గో విమానాలు కాక 5 ప్రయాణికుల విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 7న కూడా ఇక్కడి నుంచి అమెరికాకు ఓ విమానం బయలుదేరి వెళ్లింది. -
ఆపిల్‌ను వీడిన కీలక అధికారి
టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఓ కీలక ఉన్నతాధికారి గుడ్‌బై చెప్పారు. సంస్థకు ప్రభుత్వానికి వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తున్న జాన్ సోలమన్ కంపెనీను వీడినట్టు ఆపిల్ మంగళవారం వెల్లడించింది. ఆపిల్ ఉత్పత్తులను ఇతర కీలక వ్యాపారాలకు, ప్రభుత్వ సంస్థలకు సోలమన్ విక్రయిస్తుంటారు. హెచ్‌పీ ఇంక్ ఎగ్జిక్యూటివ్‌గా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సోలమన్‌ను ఆపిల్ 2015లో కంపెనీలో నియమించుకుంది. అప్పటినుంచి సోలమన్ సంస్థకు, ప్రభుత్వానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే ఆయన సంస్థను వీడినట్టు ధృవీకరించిన ఆపిల్, మిగతా విషయాలు వెల్లడించడానికి నిరాకరించింది. ఆయన ఎందుకు కంపెనీకి గుడ్‌బై చెప్పారో కూడా తెలుపులేదు. అయితే సోలమన్ వైదొలగడం ఆపిల్ సంస్థ వ్యాపారాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియరాలేదు. ఐబీఎం భాగస్వామ్యంతో కంపెనీ తన ఉత్పత్తులను అత్యధికంగా పెద్ద పెద్ద బిజినెస్‌లకు విక్రయిస్తోంది.