రాహుల్ గాంధీ ఓ జోకర్: కాంగ్రెస్ | Kerala Cong leaders back Modi, slam Rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ ఓ జోకర్: కాంగ్రెస్

Sep 22 2014 6:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్ గాంధీ ఓ జోకర్: కాంగ్రెస్ - Sakshi

రాహుల్ గాంధీ ఓ జోకర్: కాంగ్రెస్

రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. ఏకంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు.

కేరళ: కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఏకంగా కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెండో ప్రముఖ వ్యక్తిగా ఉన్న రాహుల్ ను తీవ్రంగా దుయ్యబట్టారు. అతనికి అసలు నాయకత్వ లక్షణాలు లేవంటూ సీనియర్ కాంగ్రెస్ నేత టీహెచ్ ముస్తాఫా ఎద్దేవా చేశారు. అంతటి ఆగకుండా రాహుల్ ను జోకర్ గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ఒక జోకర్ గా మిగిలిపోయారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 'అతను(రాహుల్) ఒక పార్టీలో ఒక జోకర్. పార్టీ నుంచి బయటకు విసిరివేసిన నేత' అని ముస్తాఫా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా రాహుల్ పై వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది.

 

కాగా, ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం వెనుకేసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఇరాక్ లో చిక్కుపోయిన రాష్ట్ర నర్సులను వెనుక్కుతీసుకు రావడంపై మోడీ ప్రభుత్వం చూపిన తీరును కొనియాడింది.కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న కేరళ పర్యాటకుల్ని కూడా సురక్షితంగా రాష్ట్రానికి తరలించడంపై మోడీని ప్రశంసించింది. అందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement