ఆమె మాజీ భర్తతో మాట్లాడదట | Katy Perry doesn't want to talk about ex-husband Russell Brand | Sakshi
Sakshi News home page

ఆమె మాజీ భర్తతో మాట్లాడదట

May 26 2015 9:32 AM | Updated on Sep 3 2017 2:44 AM

ఆమె మాజీ భర్తతో మాట్లాడదట

ఆమె మాజీ భర్తతో మాట్లాడదట

తన మాజీ భర్తతో మాట్లాడాలని తనకు లేదని ప్రముఖ పాప్ గాయని కేటి పెర్రీ అన్నారు.

లాస్ ఎంజిల్స్: తన మాజీ భర్తతో మాట్లాడాలని తనకు లేదని ప్రముఖ పాప్ గాయని కేటి పెర్రీ అన్నారు. మూడేళ్లుగా భర్త రస్సెల్ బ్రాండ్తో విడిపోయి ఉంటున్న ఆమెను ఓ మీడియా ప్రశ్నించగా కాస్త అసహనంగా మాట్లాడింది. తాను ఇప్పుడు మీ నుంచి ఎలాంటి వినాలనుకోవడం లేదని, ఏదైనా వినాలకున్నా.. నేర్చుకోవాలనుకున్నా అది మ్యూజిక్ ద్వారానే చేస్తానని చెప్పింది. తనకు ఏం కావాలో తన పాటలే చెప్తాయని బదులిచ్చారు.

'నేను విడాకుల దరఖాస్తు పూర్తి చేస్తున్నాను అని ఆయన(రస్సెల్ బ్రాండ్) మెస్సేజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతడు కూడా నాతో మాట్లాడలేదు. ఏదేమైన ఒక మహిళకు ప్రేమ ఎంత ముఖ్యమో విజయం అంతముఖ్యం అని అవి రెండు ఖచ్చితంగా కావాల్సిందే' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement