లాస్ ఏంజిల్స్లో జస్టిన్ బీబర్ అరెస్టు | Justin Bieber detained in Los Angeles | Sakshi
Sakshi News home page

లాస్ ఏంజిల్స్లో జస్టిన్ బీబర్ అరెస్టు

Apr 25 2014 1:26 PM | Updated on Sep 2 2017 6:31 AM

లాస్ ఏంజిల్స్లో జస్టిన్ బీబర్ అరెస్టు

లాస్ ఏంజిల్స్లో జస్టిన్ బీబర్ అరెస్టు

టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా వస్తున్న జస్టిన్ బీబర్ లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి చేరుకున్నాడు. అయితే, అతడి అంగరక్షకులు మాత్రం కస్టమ్స్ గేటు బయట అతడికోసం సాయంత్రం నాలుగు గంటల వరకు వేచిచూస్తూనే ఉన్నారు.

అయితే, ఈ కెనడియన్ పాప్ సింగర్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అసభ్య ప్రవర్తనకు గాను బీబర్ను డిపోర్ట్ చేయాలని వైట్హౌస్లో వారం క్రితం ఓ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ గొడవ వచ్చింది. జనవరిలో మియామీలో బీబర్ను అరెస్టు చేసిన తర్వాత ఈ పిటిషన్ దాఖలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement