'మీరంతా స్టీవ్ జాబ్స్లాగా పనిచేయండి' | Just Like Steve Jobs: Rahul Gandhi's Advice to Congress | Sakshi
Sakshi News home page

'మీరంతా స్టీవ్ జాబ్స్లాగా పనిచేయండి'

Sep 21 2015 3:36 PM | Updated on Mar 22 2019 6:25 PM

'మీరంతా స్టీవ్ జాబ్స్లాగా పనిచేయండి' - Sakshi

'మీరంతా స్టీవ్ జాబ్స్లాగా పనిచేయండి'

ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్లాగా అందరూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు.

మధుర: ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్లాగా అందరూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు. ఉత్తరప్రదేశ్లో పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలని సూచించారు. ఢిల్లీ నుంచి రెండు గంటలపాటు డ్రైవింగ్ ద్వారా మధురకు చేరుకున్న ఆయన అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

'స్టీవ్ జాబ్స్ తాను ఉన్నస్వల్ప స్థాయి నుంచి భారీ స్థాయిలో దృష్టి సారించి విజయం సాధించారు. అలాగే మీరు పనిచేయాలి. మన సిద్ధాంతం మనకు విజయం సాధించి పెడుతుంది. మనల్ని నెంబర్ 1గా నిలుపుతుంది. అలాగే, మీరంతా నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేయండి..  అదే సమయంలో తనపై తాను దాడి చేసుకోవడంలో మోదీ బెస్ట్ అనే విషయం మరవకండి. ప్రధాని చేసిన కనీస వాగ్దానాలు కూడా నెరవేర్చలేకపోయారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని దాదాపు 15 లక్షలమందిని ముందు పెట్టుకొని మోదీ ప్రమాణం చేసి ఆ మాటే మరిచిపోయారు' అని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement