స్విస్ బ్యాంకు ఖాతా దాచాడని.. రెండేళ్ల జైలు | jeweller awarded two years jail for hiding swiss bank account | Sakshi
Sakshi News home page

స్విస్ బ్యాంకు ఖాతా దాచాడని.. రెండేళ్ల జైలు

Apr 18 2017 8:03 PM | Updated on Sep 5 2017 9:05 AM

స్విస్ బ్యాంకు ఖాతా దాచాడని.. రెండేళ్ల జైలు

స్విస్ బ్యాంకు ఖాతా దాచాడని.. రెండేళ్ల జైలు

తనకున్న స్విస్ బ్యాంకు ఖాతా వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పకుండా దాచిపెట్టినందుకు డెహ్రాడూన్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణం యజమానికి అక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

తనకున్న స్విస్ బ్యాంకు ఖాతా వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పకుండా దాచిపెట్టినందుకు డెహ్రాడూన్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణం యజమానికి అక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రాజ్‌పూర్ రోడ్డులో నగల దుకాణం ఉన్న రాజు వర్మకు రూ. 50 వేల జరిమానా కూడా విధించారు. అతడి బ్యాంకు ఖాతాలో 2006 నాటికి రూ. 92 లక్షల మొత్తం ఉందని, ఆ విషయాన్ని అతడు వెల్లడించలేదని ఆదాయపన్ను శాఖ కోర్టుకు తెలిపింది. పన్ను ఎగవేతకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం, తప్పుడు ప్రకటనలు తదితర నేరాలకు పాల్పడినట్లు అతడి మీద కేసు రుజువైంది. పైకోర్టులో అప్పీలు చేసుకోడానికి వీలుగా అతడికి నెల రోజుల బెయిల్ మంజూరు చేశారు.  

రాజు వర్మకు స్విట్జర్లాండులో సొంత ఖాతా ఉందని 2012 సంవత్సరంలో ఆదాయపన్ను శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అతడు అప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులకు వెల్లడించలేదు. కర్జన్ రోడ్డులోని ఆయన ఇంటిపై అధికారులు 2012 మార్చి 14న సోదాలు చేశారు. స్విస్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన పత్రాలను అప్పుడే స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement