జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్ | Jet Airways Diwali Offer: Fares starting at Rs 921 | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్

Oct 26 2016 11:32 AM | Updated on Sep 4 2017 6:23 PM

జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్

జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్

జెట్ ఎయిర్వేస్ కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 921 (అన్నీ చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది.

ముంబై: దీపావళి పండుగ సందర్భంగా విమానయాన  సంస్థల దీపావళి బొనాంజా కొనసాగుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్  కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది.   రూ. 921  (అన్నీ  చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను  బుధవారం ప్రకటించింది.  ఈ ఆఫర్ నిర్దిష్ట మార్గాలలో ఆరు రోజుల పాటు  అమలుచేయనున్నట్టు  తెలిపింది.   

అక్టోబర్ 25 నుండి 30  వరకు  అమలు చేయనున్న ఈ  సిక్స్ డేస్ సేల్  ఒకవైపు ధరలకు, డైరెక్ట్  విమానాలకు అందుబాటులో ఉంటుందని  పేర్కొంది. ఈ బుకింగ్  తరువాత  15 రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్వర్క్ లో  నిర్దిష్ట దేశీయ రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుందని   ఒక ప్రకటనలో నేడు  తెలియచేసింది.

దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్  ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో   నవంబర్ 9 న గానీ,  లేదా తర్వాత గానీ ప్రయా
 ప్రయాణం చేయొచ్చని   జెట్ ఎయిర్ వేస్  చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం  తెలిపారు. దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200  డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.  117  విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్  సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్  పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement