ఇన్ఫోసిస్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి | Infosys employee found dead in office | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

May 31 2017 1:52 PM | Updated on Sep 5 2017 12:28 PM

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి  అనుమానాస్పద మృతి

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

చెన్నై లో ఓ ఐటీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

చెన్నై:  చెన్నై లో ప్రముఖ ఐటీ సంస్థ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఇన్ఫోసిస్‌ లో పనిచేస్తున్న టెకీ అనుమానాస్పద పరిస్థితుల్లో  శవమై తేలారు.  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌  ఇళయ రాజా అరుణాచలం (30)  కార్యాలయ  రెస్ట్‌ రూంలో మృతదేహాన్ని కనుగొన్నారు.  ఆయన మృతదేహం నగ్నంగా పడివుండటంతో ఇది హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

బుధవారం ఉదయం  చెన్నై మహీంద్ర వరల్డ్ సిటీలో ఇన్ఫీ కార్యాలయంలోని   బాత్‌ రూంలో  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌  ఇళయ రాజా  నగ్నంగా పడి వుండడాన్ని కనుగొన్నారు.  ఉదయం  స్లీపర్‌  శుభ్రం చేయడానికి వచ్చినపుడు ఈ విషయం వెలుగు చూసింది. దీంతో  పోలీసులుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి   చేరుకున్న  పోలీసులు  వెంటనే ఆయన్ను  ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. 

 కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని కాంచీపురం ఎస్‌పీ చెప్పారు.  మృతదేహంపై ఎలాంటి  గాయాలు లేవని, కానీ అనుమానాస్పద మరణం కేసు నమోదు చేశామని  చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అటు  ఈ వార్తతో్ తాముషాక్‌ కు గురైనట్టు  ఇన్ఫోసిస్‌  మేనేజ్‌ మెంట్‌ ప్రకటించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement