ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు | Infant's nose bitten by rat; action against 2 hospital staff | Sakshi
Sakshi News home page

ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు

Sep 4 2015 2:19 PM | Updated on Sep 3 2017 8:44 AM

ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు

ఐసీయూలో ఎలుక బారినపడ్డ మరో శిశువు

నిండా రెండు నెలలు కూడా వయసులేని ఓ మగశిశువు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంటే.. ఓ ఎలుక అతడి ముక్కును కొరికేసింది.

నిండా రెండు నెలలు కూడా వయసులేని ఓ మగశిశువు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంటే.. ఓ ఎలుక అతడి ముక్కును కొరికేసింది. ఈ దారుణం మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేయగా, మరో కేర్టేకర్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రెండు మూడు రోజుల క్రితమే ఆ పిల్లాడి ముక్కును ఎలుక కొరికేసినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటిన్నర నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పుట్టిన ఆ పిల్లాడి ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతడిని ధార్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారని సివిల్ సర్జన్ డాక్టర్ సీఎస్ గంగ్రాడే చెప్పారు.

తర్వాత ఆ పిల్లాడికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా అతడి ముక్కును ఎలుక కొరికేసింది. పైపెచ్చు ఆ శిశువు పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి స్టాఫ్ నర్సు సోనాలీ భిడేను సస్పెండ్ చేశామని, ఆశా రాథోడ్ అనే కేర్టేకర్ను ఉద్యోగం నుంచి తీసేశామని డాక్టర్ గంగ్రాడే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement