భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర! | Indian Mujahideen plot to release Yasin Bhatkal | Sakshi
Sakshi News home page

భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర!

Jan 19 2014 9:42 AM | Updated on Sep 2 2017 2:47 AM

భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర!

భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర!

తమ నాయకుడు యాసిన్ భత్కల్ను తప్పించేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యూహ్యాలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి.

న్యూఢిల్లీ: తమ నాయకుడు యాసిన్ భత్కల్ను తప్పించేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యూహ్యాలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. భత్కల్ను విడిపించుకునేందుకు ఐఎం కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను హెచ్చరించినట్టు సమాచారం. భత్కల్ను విమానంలో హైజాక్ చేసే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్నాడు. 2010, ఏప్రిల్ 17వ తేదీన బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్ల కేసులో అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement