భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు | Indian jailed in UK for over 16 years for assaulting wife, son | Sakshi
Sakshi News home page

భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు

May 15 2014 7:07 PM | Updated on Sep 2 2017 7:23 AM

కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది.


లండన్: కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. దక్షిణ యార్క్షైర్లోని బమ్స్లే ప్రాంతంలో ఉంటున్న అజిత్ శేఖన్ గతేడాది అక్టోబర్లో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్(55), కుమారుడు పాల్(31)పై దాడికి పాల్పడ్డాడు.

టీవీ చూస్తున్నారనే కోపంతో లోహపు పాత్రతో వీరిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అజిత్ భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ జరిపిన కోర్టు అజిత్ను దోషిగా తేల్చింది. కొడుకును కొట్టినందుకు 9 ఏళ్ల నెలలు, భార్యను  గాయపరిచినందుకు 6 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈనెల 9న షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement