నేపాల్ భూకంప ప్రభావం లేదు: భారత కంపెనీలు | Indian companies in Nepal see no major quake impact | Sakshi
Sakshi News home page

నేపాల్ భూకంప ప్రభావం లేదు: భారత కంపెనీలు

Apr 27 2015 12:04 AM | Updated on Oct 20 2018 6:37 PM

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల

 న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడలేదని భారతీయ కంపెనీలు పేర్కొన్నాయి. తమ ఫ్యాక్టరీ భవనానికి కొద్దిగా బీటలు వచ్చాయి తప్ప.. ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ వెల్లడించింది. భూకంపం తర్వాత తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోకకోలా ఇండియా తెలిపింది. ఐటీసీ వర్గాలు కూడా తమ ప్లాంట్లకు ఎలాంటి నష్టంవాటిల్లలేదని తెలిపాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement