ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది! | ICICI Bank blocks Flipkarts e-wallet PhonePe citing security | Sakshi
Sakshi News home page

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది!

Jan 16 2017 3:27 PM | Updated on Apr 3 2019 4:04 PM

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది! - Sakshi

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది!

పేటీఎంకు పోటీగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రంగంలోకి దించిన ఫోన్పే ఈ-వ్యాలెట్ను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసింది.

పేటీఎంకు పోటీగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రంగంలోకి దించిన ఫోన్పే ఈ-వ్యాలెట్ను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసింది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల మూలాన ఫ్లిప్కార్ట్ ఈ-వ్యాలెట్ ఫోన్పేతో చేస్తున్న లావాదేవీలను బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ నెల మొదట్లో కూడా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా ఇదే తరహా కారణాలతో పేటీఎం, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ఈ-వ్యాలెట్ సంస్థలకు ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్లను రద్దు చేసింది. శుక్రవారం నుంచి ఫోన్పేపై చేస్తున్న లావాదేవీలను బ్యాంకు రద్దు చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 
తమ సొంత ఈ-వ్యాలెట్లను కాపాడుకోవడానికే బ్యాంకులు ఈ తరహా పద్ధతిని అవలంభిస్తున్నాయని మరోవైపు నుంచి ఆరోపణలు ఎదురవుతున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్.. ఐసీఐసీఐ బ్యాంకు అన్ని ఫోన్పే, వైబీఎల్ లావాదేవీలను శుక్రవారం నుంచి బ్లాక్ చేస్తుందని, ఎలాంటి నోటీసులు లేకుండా ఈ పని చేస్తుందని మండిపడ్డారు.  డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement