ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్ | IBM Lays Out Plans to Hire 25,000 in U.S. Ahead of Trump Meeting | Sakshi
Sakshi News home page

ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్

Dec 14 2016 1:35 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్ - Sakshi

ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్

అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికన్లకు భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. రాబోయే నాలుగు సంవత్సరాలుగా దేశంలో 25,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని ప్రకటించింది.

అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికన్లకు భారీ  ఆఫర్లతో ముందుకొచ్చింది.  రాబోయే నాలుగు సంవత్సరాల్లో  దేశంలో 25,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని  ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్  వివిధ టెక్నాలజీ దిగ్గజాలతో భేటీ కి ముందు రోజు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సుమారు 6వేల ఉద్యోగాలను 2017లో తీసుకోనున్నామని  ఐబిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గిన్నీ రోమట్టీ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో సంస్థ  కార్యకలాపాలు చేపట్టిన పునర్నిర్మాణంలో భాగంగాఓ రాబోయే నాలుగు సంవత్సరాలలో బిలియన్ డాలర్లను ఉద్యోగి శిక్షణ మరియు అభివృద్ధికో్సం  పెట్టుబడిగా పెట్టనుందని ఐబీఎం ఛైర్మన్ తెలిపారు. డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చాలా సంస్థలు  తమ వ్యాపారాన్ని పునర్నిర్మించుకుంటున్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ నియామకాలు వైట్ కాలర్ వెర్సస్ బ్లూ కాలర్  కాదనీ, పరిశ్రమలో భారీ డిమాండ్ ఉండి, ఖాళీగా ఉండిపోతున్న కొత్త కాలర్ ఉద్యోగాలని  ఆమె చెప్పారు.
మరోవైపు  ట్రంప్ అమెరికా ఆర్థికవృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ట్రంప్ ఏర్పాటు చేసిన   బిజినెస్ లీడర్ల స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరంలో రోమెట్టి సభ్యురాలిగా ఉన్నారు.

గత కొన్ని ఏళ్లుగా ఐబీఎం లాంటి అమెరికా దిగ్గజాలు  దేశంలో వేల ఉద్యోగాలు  తొలగిస్తూ  భారతదేశ ఉద్యోగులవైపు మొగ్గు చూపుతున్నాయన్న విమర్శలు చెలరేగాయి. దీంతో దశాబ్దంలో మొదటిసారి 2013  సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే  చివరిలో స్వల్పంగా ఉద్యోగులను నియమించుకున్నట్టు నివేదించింది. ఆ  తరువాతి సంవత్సరం మొత్తం వర్క్  ఫోర్స్ లో 12 శాతం నియమించుకున్నట్టు తెలిపింది. అలాగే  గత అయిదేళ్లలో లేని ప్రాధాన్యతను గత ఏడాది అమెరికా  ఉద్యోగులకు ఇచ్చినట్టు ఐబీఎం  వెల్లడించింది.

వివిధ సంస్థల అధిపతులు ముఖ్యంగా  అమెజాన్ సీఈవో  జెఫ్ బెజోస్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రో సాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల  అక్షరం లారీ పేజ్ (గూగుల్) తెస్లా  నుంచి ఎలాన్ మస్క్  స్పేస్ ఎక్స్ అధిపతులను బుధవారం జరగనున్న సమావేశానికి ఆహ్వానం అందింది.

అటు  చైనాలో రూపొందించే  ఐ ఫోన్లను అమెరికాలో తయారు కావాలని ఆశిస్తున్నట్టు  ట్రంప్  గత వారం ప్రకటించారు. ఇందుకు అమెరికాలో పెద్ద ఫ్యాక్టరీని  నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. తద్వారా  అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు ఆలోచిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement