కూలిన సుఖోయ్ -30 విమానం | IAF's fighter plane Sukhoi 30 crashes in Pune, both pilots eject safely | Sakshi
Sakshi News home page

కూలిన సుఖోయ్ -30 విమానం

Oct 14 2014 7:38 PM | Updated on Sep 2 2017 2:50 PM

కూలిన సుఖోయ్ -30 విమానం

కూలిన సుఖోయ్ -30 విమానం

ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది.

పుణె:ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది. భారత యుద్ధ విమానం సుఖోయ్ 30 ఎమ్ -ఐ తూర్పు పుణెకు 35 కిలోమీటర్ల దూరంలో కుప్పుకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో పైలెట్ తో సహా కో పైలెట్ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారు స్వల్పపాటి గాయాలతో బయటపడ్డారు.

 

ఈ ఇద్దరి పైలెట్లను ఒక ఐఎఎఫ్ హెలికాప్టర్ లో తీసుకొచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తెలిపింది. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం 1.10 ప్రాంతంలో జరిగినట్టు లాహ్ గాన్ ఏఎఫ్ఎస్ అధికారి స్పష్టం చేశారు. గాలిలోకి ఎగిరిన కాసేపట్లోనే విమానం కూలినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement