ప్రముఖ జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేశ్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.
లంకేశ్ హత్య: హైదరాబాద్ జర్నలిస్టుల ఖండన
Sep 6 2017 5:26 PM | Updated on Sep 12 2017 2:04 AM
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేశ్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. హత్య పై విచారణ జరిపించి హత్య వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన మూడు హత్యలపై ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు నేతలు, సామాజిక కార్యకర్తలు, పలు పార్టీ నేతలు తరలి వచ్చారు. నిరసనలో ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు దేవుల పల్లి అమర్, సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఐజేయూ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పీఓడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్త దేవి, టీపీఎఫ్ నాయకులు కృష్ణ తదీతరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement