breaking news
Hyderabad journalists
-
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బ్రిడ్జి కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, ఇతర వర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం ఒక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని, సర్టిఫికెట్ సైతం జారీ చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణ లో పెట్టాలని జర్నలిస్టులకు సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో తరగతులు నిర్వహించి ఆరు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని, దళిత, మహిళా, హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణతో మరో 1,000 మంది లబ్ధి పొందారని చెప్పారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలి స్టులకు అందజేసిందని, అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటో రియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయని తెలిపారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు వెటరన్ జర్నలిస్ట్, ‘మహిళా విజయం’ మాస పత్రిక సంపాదకు రాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. -
లంకేశ్ హత్య: హైదరాబాద్ జర్నలిస్టుల ఖండన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేశ్ హత్యను హైదరాబాద్ జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. బషీర్ బాగ్ చౌరస్తాలో గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. హత్య పై విచారణ జరిపించి హత్య వెనుక ఉన్నవారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన మూడు హత్యలపై ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు నేతలు, సామాజిక కార్యకర్తలు, పలు పార్టీ నేతలు తరలి వచ్చారు. నిరసనలో ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు దేవుల పల్లి అమర్, సాక్షి ఈడీ రామచంద్ర మూర్తి, ఐజేయూ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పీఓడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్త దేవి, టీపీఎఫ్ నాయకులు కృష్ణ తదీతరులు పాల్గొన్నారు.