మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్‌మన్ | Hugh Jackman to be face of Micromax | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్‌మన్

Oct 19 2013 1:50 AM | Updated on Sep 1 2017 11:45 PM

మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్‌మన్

మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా ‘ఎక్స్-మెన్’ జాక్‌మన్

ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు ఎక్స్-మెన్ సినిమాల హీరో, ప్రముఖ హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్‌మన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యహరించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు ఎక్స్-మెన్ సినిమాల హీరో, ప్రముఖ హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్‌మన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యహరించనున్నారు. విదేశీ మార్కెట్లపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ ఈ హాలీవుడ్ స్టార్‌తో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఒక హాలీవుడ్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత మొబైల్ కంపెనీగా మైక్రోమ్యాక్స్ నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడానికి అక్కడి ప్రజలతో అనుసంధానానికి హ్యూ జాక్‌మన్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని భావి స్తున్నట్లు   మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, శుభోదిప్ పాల్ చెప్పారు. భారత్ అద్భుత దేశమని, ఈ దేశాన్ని తాను అమితం గా ప్రేమిస్తానని జాక్‌మన్ వ్యాఖ్యానించారు.
 
 సీఈవో రాజీనామా: మైక్రోమ్యాక్స్ సీఈవో పదవికి దీపక్ మెహరోత్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల దీపక్ రాజీనామా చేశారని మైక్రోమ్యాక్స్ తెలిపింది. కొత్త సీఈవోను త్వరలోనే ప్రకటిస్తామని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement