నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా కాల్వకు మంగళవారం గండిపడింది.
కర్నూలు: నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా కాల్వకు మంగళవారం గండిపడింది. దాంతో భారీగా నీరు లీకవుతున్నడంతో పంటపొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హంద్రీనీవా కాల్వకు గండిపడటంతో మూడు మోటార్లను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. అయితే నాణ్యత లోపం వల్లే హంద్రీనీవా కాల్వకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.