మూడు మృతదేహాలు లభ్యం | Himachal Pradesh Incident three dead bodies found | Sakshi
Sakshi News home page

మూడు మృతదేహాలు లభ్యం

Jun 9 2014 9:12 AM | Updated on Sep 2 2017 8:33 AM

హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మూడు మృతదేహాల్లో ఓ విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయిన విద్యార్థిని ఐశ్వర్యగా గుర్తించారు.

మరోవైపు గల్లంతైన విద్యార్థుల కోసం హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. జాతీయ విపత్తు నివారణ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తమ బిడ్డలు ఏమైయ్యారోనని గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement