'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే' | High Court stays Virbhadra Singh's arrest | Sakshi
Sakshi News home page

'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే'

Oct 1 2015 12:18 PM | Updated on Sep 27 2018 8:37 PM

'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే' - Sakshi

'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే'

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఊరట కలిగింది. ఆయన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఊరట కలిగింది. ఆయన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. అక్రమంగా ఆస్తులు పోజేశారని వీరభద్రసింగ్పై ఆరోపణలు సీబీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో తమను అరెస్టు చేయకుండా స్టే విధించాలని వారు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ అరెస్టుపై స్టే విధించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించిందని, ఇది అక్రమం అని పేర్కొంటూ వారిని ప్రశ్నించాలని కోర్టుకు తెలియజేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 18న తదుపరి ఉత్తర్వులు వెలువరిస్తామని, అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement