ఎబోలాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! | Harshvardhan dismisses fears about Ebola outbreak in India | Sakshi
Sakshi News home page

ఎబోలాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

Aug 17 2014 5:33 PM | Updated on Sep 2 2017 12:01 PM

ఎబోలా వైరస్ కేసులు మన దేశంలో ఇంతవరకు నమోదు కాలేదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

బెంగళూరు: ఎబోలా వైరస్ కేసులు మన దేశంలో ఇంతవరకు నమోదు కాలేదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఎబోలా వైరస్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను సునిశితంగా పరీక్షిస్తున్నామన్నారు. ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని చెప్పారు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి.. దేశవ్యాప్తంగా అలాంటి మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
 

పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement