ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే | Gujarat Village Thumbs Nose At Cash Crunch, Pays Through SMS | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే

Nov 17 2016 9:01 PM | Updated on Sep 4 2017 8:22 PM

ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే

ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలంతా క్యూ కడుతుంటే గుజరాత్ లో ఓ గ్రామంలో మాత్రం అలాంటి ఇబ్బందులేవీ కనిపించడం లేదు.

సబర్కంతా: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలంతా క్యూ కడుతుంటే గుజరాత్ లో ఓ గ్రామంలో మాత్రం అలాంటి ఇబ్బందులేవీ కనిపించడం లేదు. ఆ గ్రామమే అకోదర. ఈ గ్రామంలోని ప్రజలంతా ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే డబ్బు చెల్లిస్తారు. అది వెయ్యి అయినా లేక పది రూపాయలే అయినా కూడా. నగదు చెల్లించాల్సిన వ్యక్తి అకౌంట్ నంబర్ కు డబ్బును ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తారు. 

ఏడాది క్రితం అకోదరను ఓ ప్రైవేటు బ్యాంకు డిజిటల్ గ్రామంగా మార్చేందుకు నడుంబిగించడమే ఇందుకు కారణం. అప్పటి నుంచి ఈ గ్రామంలో కొనుగోళ్లు, తిరిగి చెల్లింపులు మొత్తం ఆన్ లైన్ ద్వారానే సాగుతున్నాయి. దేశంలోని తొలి డిజిటల్ గ్రామం కూడా అకోదరే. గ్రామం మొత్తం 24 గంటలూ వైఫై అందుబాటులో ఉంటుంది. ఈ గ్రామంలో ఓ ఏటీఎం కూడా ఉంది. కానీ గ్రామస్ధులు ఎవరూ దాన్ని వినియోగించరు. 

గ్రామంలోని 1500 మంది జనాభాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొనుగోలు చేయదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే డబ్బు చెల్లింపులు చేస్తారు. గ్రామం మొత్తం వైఫై సౌకర్యం ఉన్నా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఎస్ఎంఎస్ విధానాన్ని అనుసరిస్తున్నారని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement