breaking news
digital village
-
ఆరంభ శూరత్వమే తప్ప అభివృద్ధి లేదు
-
ఆ గ్రామంలో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎందుకు లేదంటే
సబర్కంతా: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలంతా క్యూ కడుతుంటే గుజరాత్ లో ఓ గ్రామంలో మాత్రం అలాంటి ఇబ్బందులేవీ కనిపించడం లేదు. ఆ గ్రామమే అకోదర. ఈ గ్రామంలోని ప్రజలంతా ఎస్ఎంఎస్ ల ద్వారా మాత్రమే డబ్బు చెల్లిస్తారు. అది వెయ్యి అయినా లేక పది రూపాయలే అయినా కూడా. నగదు చెల్లించాల్సిన వ్యక్తి అకౌంట్ నంబర్ కు డబ్బును ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఏడాది క్రితం అకోదరను ఓ ప్రైవేటు బ్యాంకు డిజిటల్ గ్రామంగా మార్చేందుకు నడుంబిగించడమే ఇందుకు కారణం. అప్పటి నుంచి ఈ గ్రామంలో కొనుగోళ్లు, తిరిగి చెల్లింపులు మొత్తం ఆన్ లైన్ ద్వారానే సాగుతున్నాయి. దేశంలోని తొలి డిజిటల్ గ్రామం కూడా అకోదరే. గ్రామం మొత్తం 24 గంటలూ వైఫై అందుబాటులో ఉంటుంది. ఈ గ్రామంలో ఓ ఏటీఎం కూడా ఉంది. కానీ గ్రామస్ధులు ఎవరూ దాన్ని వినియోగించరు. గ్రామంలోని 1500 మంది జనాభాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొనుగోలు చేయదలుచుకున్నా, అమ్మదలుచుకున్నా బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే డబ్బు చెల్లింపులు చేస్తారు. గ్రామం మొత్తం వైఫై సౌకర్యం ఉన్నా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఎస్ఎంఎస్ విధానాన్ని అనుసరిస్తున్నారని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. -
డిజిటల్ ఇండియాలో మొదటి స్థానంలో ముక్ర (కే)
ఇంటì కో ఎల్ఈడీ బల్బు ఉచింతంగా పంపిణీ ఇచ్చోడ : వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడంతో ముక్ర (కే) దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించినట్లు సీఎస్సీ నిర్వాహకుడు కొండ ప్రశాంత్ తెలిపారు. గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించడంతో అయన మంగవారం గ్రామంలో ఇంటికొక్క ఎల్ఈడీ బల్బును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామంలో వంద శాతం అక్షరాస్యత సాధించినట్ల తెలిపారు. తెలంగాణలో నాలుగో స్థానంలో ఎంపికైన గ్రామం ప్రస్తుతం దేశంలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. గ్రామ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు గాడ్గే సుభాష్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా తమ గ్రామం దేశంలో మొదటి స్థానం సంపాదించడంపై గర్వంగా ఉందన్నారు. వంద అక్షరాస్యత సాధించడంతో తమ గ్రామంలో కుటంబానికి ఎల్ఈడీ బల్బులను ఉచితంగా సీఎస్సీ నిర్వహకుడు ప్రశాంత్ అదించడం పట్ల అయనను అభినందించారు. వారు అదించిన బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.