తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె | Gopinath Munde's daughter Pankaja perform last rites | Sakshi
Sakshi News home page

తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె

Jun 4 2014 2:20 PM | Updated on Sep 2 2017 8:19 AM

తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె

తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ముగిశాయి.

బీడ్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ముగిశాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం మధ్నాహ్నం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీలో అంత్యక్రియలు నిర్వహించారు. ముండేకు కుమారులు లేకపోవడంతో ఆయన పెద్ద కుమార్తె పంకజ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో తండ్రి చితికి నిప్పంటించారు.

ఇక తమ అభిమాన నేతను కడసారి దర్శించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు ముండే అంత్యక్రియలకు హాజరయ్యారు. ముండేకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement