గ్లోబల్ ట్రావెల్ సెర్చ్ ఇంజన్ 'కయాక్' ఎంట్రీ | Global travel search engine KAYAK enters India | Sakshi
Sakshi News home page

గ్లోబల్ ట్రావెల్ సెర్చ్ ఇంజన్ 'కయాక్' ఎంట్రీ

Jan 11 2017 7:56 PM | Updated on Sep 5 2017 1:01 AM

గ్లోబల్ ట్రావెల్ సర్చ్ ఇంజన్ కయాక్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని బుధవారం సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ముంబై:  గ్లోబల్ ట్రావెల్ సర్చ్ ఇంజన్ కయాక్  భారత మార్కెట్లో ఎంట్రీ  ఇస్తోంది.  ఈ విషయాన్ని బుధవారం సంస్థ  అధికారికంగా ప్రకటించింది. తమ వెబ్సైట్, ట్రావెల్ యాప్ ద్వారా  భారత్ లోని వినియోగదారులకు  మరింత సమాచారాన్ని అందించేందుకు  సిద్ధమవుతోంది.  బహుళ వెబ్సైట్లకు వెళ్ళకుండా, ధరలు,  ప్రైస్ ఎలర్ట్స్, సహా  ప్రయాణాల ఉచిత నిర్వహణ వంటి సేవలను కయాక్  అందించనుంది.
ప్రజలకు  వినూత్న ప్రయాణ  సౌకర్యాలను అందించే దిశగా , వారి వారి  ట్రిప్ లను ప్లాన్ చేసుకునేందుకు  సహాయం చేసేలా  పనిచేయనున్నట్టు కయాక్ డైరెక్టర్ (ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశం)  ఫంగ్ పిటిఐకి తెలిపారు.  భారతదేశం లో ట్రావెల్ మార్కెట్ కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో  భారత మార్కట్లో ప్రవేశానికి ఇదే  సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు.  ప్రజల పర్యటనకు  అవసరమైన సమాచారాన్ని పొందడానికి తమ సంస్థ సహాయపడుతుందన్నారు.  అనేక వెబ్ సైట్లను దర్శించాల్సిన అవసరం లేకుండానే  కయాక్ వినియోగదారులు కేవలం కొన్ని క్లిక్ లతో వందల సైట్ల సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు.
ఈ  మేరకు  డిజిటల్ సహా  సోషల్ మీడియా, ఈ కామర్స్, ఇతర  అన్ని మీడియాల్లో భారీ ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.  ఆసియా పసిఫిక్ దేశాల్లో అగ్రస్థానంలో ఒకటిగా  ఉన్న భారత్  వినియోగదారులకు మరింత అదనపు  ప్రయోజనాలను అందించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. కొరియా, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ ఇతర టాప్ మార్కెట్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు.

కాగా కయాక్ 20భాషల్లో 40  అంతర్జాతీయ సైట్లను నిర్వహిస్తోంది. 2016 సం.లో 1.5  మిలియన్ల సెర్చ్ లను  నమోదు చేసింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement