చైనాలో మరో వ్యాపార వికృతం | global campaign to free the world’s “saddest polar bear” | Sakshi
Sakshi News home page

చైనాలో మరో వ్యాపార వికృతం

Oct 29 2016 9:52 AM | Updated on Sep 4 2017 6:41 PM

చైనాలో మరో వ్యాపార వికృతం

చైనాలో మరో వ్యాపార వికృతం

చైనాలో మరో వ్యాపార వికృతం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నారు.

బీజింగ్: చైనాలో మరో వ్యాపార వికృతం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నారు. చిన్నిచిన్న గదుల్లో అరుదైన జంతువులను బంధించి వాటిని చూపిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఈ పోకడను గర్హిస్తూ జంతుప్రేమికులు పెద్ద ఎత్తున పోరాటానికిదిగారు.

వీడియోలో కనిపిస్తోన్న ధృవపు ఎలుగుబంటి పేరు 'పిజ్జా'. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా దీనిని అబివర్ణిస్తున్నారు. ఎక్కడో ధృవప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన పిజ్జా.. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలోని ఒక షాపింగ్ మాల్ లో బందీగా పడిఉంది. క్షణమైనా కూర్చోకుండా బయటికి పోయే దారిని వెతుక్కుంటూ పిజ్జా పడే బాధలు చూస్తే.. మనిషనేనేవాడు కరిగిపోతాడు. కానీ..
 
పిజ్జా సహా మరికొన్ని అరుదైన జంతువులను చెరలో బంధించిన వ్యాపారులు మాత్రం వాటిని వదిలిపెట్టే సమస్యేలేదంటున్నారు. ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇంచ్చిందని వాదిస్తున్నారు. దీంతో కొందరు జంతు ప్రేమికులు వాటి విడుదల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పిజ్జా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉద్యమం ఊపందుకుంది. ఈ ప్రచారానికి మీరు కూడా మద్దతు పలికితే పిజ్జా చేత.. 'ఏం మనుషులురా బాబూ..' అని తిట్లు తప్పించుకున్నవాళ్లవుతారు. (తప్పక చదవండి: చైనాలో వ్యాపార వికృతం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement