నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7 | Funny reactions to the exploding Samsung Galaxy Note 7 | Sakshi
Sakshi News home page

నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7

Sep 24 2016 4:25 PM | Updated on Sep 4 2017 2:48 PM

నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7

నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7

గెలాక్సీ నోట్7.. ఇప్పటివరకు రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలన్నింటిలో బెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఫోన్గా శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీజైన కొన్ని రోజుల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయిన ఈ ఫోన్, ఒక్కసారిగా టైమ్ బాంబుగా మారిపోయింది.దీంతో గెలాక్సీ నోట్7పై నెట్ లో ఫన్నీ రియాక్షన్స్ హల్చల్ చేస్తున్నాయి...

గెలాక్సీ నోట్7.. ఇప్పటివరకు రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలన్నింటిలో బెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఫోన్గా శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీజైన కొన్ని రోజుల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయిన ఈ ఫోన్, ఒక్కసారిగా టైమ్ బాంబుగా మారిపోయింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్కు, అటు వినియోగదారులకు వణుకు పుట్టించింది. లి-అయాన్ బ్యాటరీలకు సంబంధించిన తప్పుడు బ్యాచ్ను ఈ ఫ్లాగ్షిప్లో వాడటమే దీనికి ప్రధాన కారణం.

ఈ ఘటనలపై వెంటనే స్పందించిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. కొత్త ఫోన్లతో గెలాక్సీ నోట్7ను రీప్లేస్ చేసింది. ఈ ఫోన్ను విమానంలో ప్రయాణించేటప్పుడు వాడకూడదంటూ పలు దేశ విమానయాన సంస్థలు సీరియస్ వార్నింగ్లు కూడా ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఫోన్గా అభివర్ణించాయి. వీరందిరి కంటే వేగంగా ఈ ఘటనలపై ఇంటర్నెట్ స్పందించింది. ఫన్నీ జోక్స్, ఇమేజెస్తో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించింది.  శాంసంగ్ గెలాక్సీ నోట్7పై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఫన్నీ జోక్స్ ఏమిటో మీరు ఓసారి తిలకించండి....








 

Advertisement
 
Advertisement
Advertisement