ఇంతకీ ఏం జరిగిందంటే..? | Friend shoots Indian doctor in Texas, kills self | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఏం జరిగిందంటే..?

Jun 15 2015 11:26 AM | Updated on Jul 6 2019 12:42 PM

భార్యతో డాక్టర్ సురేశ్(ఫైల్) - Sakshi

భార్యతో డాక్టర్ సురేశ్(ఫైల్)

ఇంతలో తలుపు గడియపెట్టిన చప్పుడు, మరోసారి తుపాకీ మోతతో అక్కడున్న వారు నిశ్చేష్టులయ్యారు.

టెక్సాస్: అది అమెరికాలోని మిడ్ ల్యాండ్ ఒడెసా(టెక్సాస్)లో ఉన్న హెల్దీ హార్ట్ సెంటర్ ఆస్పత్రి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భారత సంతతికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ సురేశ్ గడసల్లి...రోగులను పరీక్షించేందుకు రౌండ్స్ కు వచ్చారు. ఆయన గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాలకే 'అయ్యో దేవుడా' అంటూ ఒక రోగి భయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ వెంటనే పలుమార్లు తుపాకీ పేల్చిన శబ్దం వినబడడంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా నిలువెల్లా వణికిపోయారు. ఇంతలో తలుపు గడియపెట్టిన చప్పుడు, మరోసారి తుపాకీ మోతతో అక్కడున్న వారు నిశ్చేష్టులయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?
డాక్టర్ సురేశ్ గడసల్లిని ఆయన స్నేహితుడు అయ్యసామి తగ్నం(60) కాల్చిచంపాడు. తర్వాత అదే తుపాకీతో కాల్చుకుని అయ్యసామి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. సురేశ్ కు అత్యంత సన్నిహితుడైన అయ్యసామి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనేది వెల్లడికాలేదు. వీరిద్దరూ కలిసి ప్రతివారం కార్డ్స్ ఆడేవారని సన్నిహితులు తెలిపారు. బెంగళూరుకు చెందిన సురేశ్ 1993లో టెక్సాస్ కు వలస వచ్చారు. తన హస్తవాసితో ప్రముఖ వైద్యునిగా పేరొందారు. సురేశ్ ను అయ్యసామి ఎందుకు హత్య చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement