కూలిన హెలికాప్టర్: నలుగురు మృతి | Four believed dead in British helicopter crash | Sakshi
Sakshi News home page

కూలిన హెలికాప్టర్: నలుగురు మృతి

Mar 14 2014 8:42 AM | Updated on Sep 2 2017 4:42 AM

పశ్చిమ బ్రిటన్లో నార్ఫోక్ ప్రాంతంలో బ్రిటిష్ హెలికాప్టర్ కూలి నలుగురు ప్రయాణికులు మరణించారని పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.

పశ్చిమ బ్రిటన్లో నార్ఫోక్ ప్రాంతంలో బ్రిటిష్ హెలికాప్టర్ కూలి నలుగురు ప్రయాణికులు మరణించారని పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.ఆ ప్రమాదం నిన్న చోటు చేసుకుందని తెలిపారు. మృతులను గుర్తించి,వారి బంధువులకు అప్పగిస్తామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ఘటనపై ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీసు సమాచారం అందించారని పేర్కొన్నారు. దాంతో వైద్యులు అంబులెన్స్లో ఘటన స్థలానికి చేరుకున్నారని, అయితే హెలికాప్టర్ లోని ప్రయాణికులు నలుగురు మృతి చెందారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement