హోటల్పై దాడి : పలువురు మృతి | Five killed in terror attack on Mali hotel | Sakshi
Sakshi News home page

హోటల్పై దాడి : పలువురు మృతి

Aug 8 2015 9:48 AM | Updated on Apr 4 2019 5:24 PM

మాలీలోని సివారి పట్టణంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు.

బమాకో : మాలీలోని సివారి పట్టణంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. పట్టణంలోని హోటల్పై తీవ్రవాదులు దాడి చేసి... పలువురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన వారంతా ఐక్యరాజ్య సమితిలో పని చేసే వారని మీడియా శనివారం వెల్లడించింది. అయితే కిడ్నాప్ అయిన వారి సంఖ్య మాత్రం తెలియదని పేర్కొంది. 

కిడ్నాప్ అయిన వారిని విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపింది. మాలీలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు గత ఎన్నో ఏళ్లుగా విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సివారి పట్టణం మాలీ రాజధాని బమాకోకు 600 కిలోమీటర్ల దూరంలోని ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement