అజ్ఞాతంలోకి రాహుల్‌గాంధీ తరలింపు! | farmers protest, Rahul detained | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: అజ్ఞాతంలోకి రాహుల్‌గాంధీ తరలింపు!

Jun 8 2017 1:39 PM | Updated on Jun 4 2019 5:16 PM

అజ్ఞాతంలోకి రాహుల్‌గాంధీ తరలింపు! - Sakshi

అజ్ఞాతంలోకి రాహుల్‌గాంధీ తరలింపు!

రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ ప్రాంతాన్ని సందర్శించడానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన

మంద్‌సౌర్‌: రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ ప్రాంతాన్ని సందర్శించడానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తలపెట్టిన పర్యటనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తన పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. వారి కళ్లుగప్పి ఎలాగైనా మంద్‌సౌర్‌కు చేరుకొని.. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపాలని రాహుల్‌ భావించారు. కార్యకర్తల సాయంతో మంద్‌సౌర్‌కు చేరుకుంటుండగా మార్గమధ్యలో నీమూచ్‌ వద్ద పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బలవంతంగా ఒక బస్సులోకి ఎక్కించి గుర్తుతెలియని అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లారు.

మంద్‌సౌర్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారంటూ మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచేందుకు మంద్‌సౌర్‌కు రాహుల్‌ బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement