పాక్‌ దాష్టీకంపై కన్నీరుమున్నీరు! | Family mourns the death of BSF Jawan Sushil Kumar | Sakshi
Sakshi News home page

పాక్‌ దాష్టీకంపై కన్నీరుమున్నీరు!

Oct 24 2016 11:23 AM | Updated on Mar 23 2019 8:40 PM

పాక్‌ దాష్టీకంపై కన్నీరుమున్నీరు! - Sakshi

పాక్‌ దాష్టీకంపై కన్నీరుమున్నీరు!

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం జరిపిన విచక్షణారహితమైన కాల్పుల్లో ఒక భారత జవాను ఒకరు అమరుడయ్యారు.

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం జరిపిన విచక్షణారహితమైన కాల్పుల్లో ఒక భారత జవాను ఒకరు అమరుడయ్యారు. సోమవారం తెల్లవారుజామున జమ్మూ ఆర్‌ఎస్‌ పుర సెక్టర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా భారీ కాల్పులు, మోర్టార్‌ షెల్లింగ్‌ దాడులతో పాక్‌ రేంజర్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో హర్యానా కురుక్షేత్రకు చెందిన బీఎస్‌ఎఫ్‌ సుశీల్‌ కుమార్‌ ప్రాణాలు విడిచారు.

సరిహద్దుల్లో పహారా కాస్తూ పాక్‌ కాల్పుల్లో ఆయన చనిపోయారన్న వార్త తెలియడంతో సుశీల్‌కుమార్‌ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశీల్‌కుమార్‌ భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతూ విలపించారు. దీంతో సుశీల్‌కుమార్‌ ఇంటి వద్ద, ఆయన గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement