'గొర్రెల కాపరి రాష్ట్రపతి.. చాయ్ వాలా ప్రధాని కావొచ్చు' | Sakshi
Sakshi News home page

'గొర్రెల కాపరి రాష్ట్రపతి.. చాయ్ వాలా ప్రధాని కావొచ్చు'

Published Thu, Dec 5 2013 3:44 PM

'గొర్రెల కాపరి రాష్ట్రపతి.. చాయ్ వాలా ప్రధాని కావొచ్చు' - Sakshi

నరేంద్రమోడిపై ఎప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి ఊహించిన విధంగా సానుకూల వ్యాఖ్యలు వెలువడటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మూఢ విశ్వాసాలను వదిలించుకోవడంతోపాటు, వాటికి మోడీ దూరంగా ఉంటున్నారని దిగ్విజయ్ సానుకూలంగా స్పందించడం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ దేశానికి ప్రధాని చాయ్ వాలా కూడా ప్రధాని కావొచ్చని డిగ్గిరాజా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూఢ విశ్వాసాలను వీడి అటల్ బీహారీ వాజ్ పేయి సిద్దాంతాలను మోడీ అనుసరించడం స్వాగతించ తగ్గ పరిణామం అని దిగ్విజయ్ అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలకు, నెహ్రూ ఆశయాలకు మోడీ, బీజేపీలు దగ్గరవుతున్నారని ఆయన అన్నారు. 'అయినా తాను మోడీని ప్రధానిగా ప్రజలు అంగీకరించరు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సుష్మా స్వరాజ్ ను ప్రధానిగా చేయాలి' అని దిగ్విజయ్ మీడియాతో అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో కేరళకు చెందిన గొర్రెల కాపరి రాష్ట్రపతి కావొచ్చు లేదా ఓ చాయ్ వాలా ప్రధాని కూడా అవ్వచ్చు అని అన్నారు. మోడీపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు స్వాగతించారు. 
 

Advertisement
Advertisement