
సౌర కారు రూపకల్పన: ఇంజినీరింగ్ విద్యార్థుల సృజన
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురంలోని జయముఖి ఇంజనీరింగ్ విద్యార్థులు సౌర శక్తితో నడిచే కారును తయారు చేశారు.
చెన్నారావుపేట(వరంగల్): వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురంలోని జయముఖి ఇంజనీరింగ్ విద్యార్థులు సౌర శక్తితో నడిచే కారును తయారు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రంజిత్, రాము, అనిల్, మహేష్, భరత్, సుమన్, ఫయాజ్, హరీష్, శశి, ప్రణయ్, వంశీ, ఐలు, సాయికిరణ్‌లు ఈ కారు రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
డీసీ సోలార్ పవర్‌ను విద్యుత్‌గాను, ఈ విద్యుత్ శక్తి డీసీ మోటార్ ద్వారా మెకానికల్ శక్తిగా మారి వాహనం నడుస్తుందని మెకానికల్ హెచ్‌వోడీ విక్రంరెడ్డి తెలిపారు. దాదాపు 40 కేఎంపీహెచ్ సామర్థ్యం ఉన్న ఈ కారులో బ్యాటరీ ఆరు గంటల పాటు పని చేస్తుంది. 180 నుంచి 240 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇలాంటి కార్లను పరిశ్రమలు, వర్సిటీల ఆవరణలో తిరిగేందుకు ఉపయోగపడతాయి.