ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు | Donald Trump sacks acting US attorney general | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు

Jan 31 2017 9:31 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు - Sakshi

ట్రంప్‌కు అడ్డొస్తే అంతే: అటార్నీ జనరల్‌పై వేటు

ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి రానీయకుండా జారీచేసిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

వాషింగ్టన్‌: ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి రానీయకుండా జారీచేసిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిషేధాజ్ఞల విషయంలో ప్రభుత్వానికి సహకరించడం లేదన్న కారణంతో తాత్కాలిక అటార్నీ జనరల్‌ (న్యాయ శాఖ అధిపతి) సలే యాట్స్‌ను పదవి నుంచి తొలగించారు.

‘అమెరికన్ల ప్రయోజనం కోసం జారీ అయిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సమర్థించకుండా ఆమె(సలే యాట్స్‌) విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. అందుకే ఆమెను పదవిననుంచి తొలిగించాం’అని వైట్‌హౌస్‌ అధికారులు సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. వర్జీనియా అటార్నీగా పనిచేస్తోన్న డనా బౌంటేను నూతన (తాత్కాలిక )అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ప్రమాణం చేశారు.

ముస్లిం దేశాలపై ట్రంప్‌ జారీచేసిన ఉత్తర్వులను ఫెడరల్‌ కోర్టులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ న్యాయశాఖ వాదనలు వినిపించాల్సిఉంది. అయితే సలే యాట్స్‌ మాత్రం ట్రంప్‌ నిషేధ నిర్ణయానికి అనుకూలంగా వాదించబోనని మొండిపట్టుదల ప్రదర్శించారు. ట్రంప్‌ను సమర్థించవద్దంటూ సహచర లాయర్లకు లేఖలు కూడా రాశారు. అటార్నీ జనరల్‌ పదవిలోఉండి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సలేను పదవినుంచి తొలిగించిన కొద్దిసేపటికే ఈ వ్యవహారంపై ట్రంప్‌ ట్వీట​ చేశారు. ‘ఒబామాచేత నియమితురాలైన అధికారులు మా పనికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు’అని సలే యాట్స్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)


ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90 రోజులపాటు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పలు ఫెడరల్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. నాలుగు కోర్టులైతే ఏకంగా ఉత్తర్వులనే నిలుపుదలచేస్తూ తీర్పులిచ్చాయి. అటార్నీ జనరల్‌ నేతృత్వంలోని లాయర్లు.. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వాదలను వినిపించాల్సిఉంటుంది. ఆపని చేయని కారణంగా సలే యాట్స్పై వేటుపడింది. (ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement