దొరికినోడికి దొరికినంత.. | diamond at Crater of Diamonds | Sakshi
Sakshi News home page

దొరికినోడికి దొరికినంత..

Aug 21 2015 1:09 AM | Updated on Sep 3 2017 7:48 AM

చిన్నా పెద్దా తాపీగా కూర్చుని పొలం పనులు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్న వీరంతా వజ్రాలు వెతుకుతున్నారు.

చిన్నా పెద్దా తాపీగా కూర్చుని పొలం పనులు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్న వీరంతా వజ్రాలు వెతుకుతున్నారు. వజ్రాలేంటి వెతకడమేంటి అనేగా మీ సందేహం.. అమెరికాలోని ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’లో ఇది సాధ్యమే. ఆర్కాన్సాస్ రాష్ర్టంలోని ముఫ్రీస్‌బొరోలో ఉన్న ఈ 37 ఎకరాల పార్క్‌కు సామాన్య ప్రజలెవరైనా వెళ్లొచ్చు. అంతేకాదు అక్కడి నేలలో వజ్రాలు వెతుక్కుని దొరికిన వాటిని తమ వెంట తీసుకెళ్లొచ్చు కూడా. ఇక చెప్పేదేముంది ఇక్కడికి వచ్చే సందర్శకులకు పండుగే పండుగ.

యజమాని జాన్ హడిల్సన్‌కు ఈ నేలలో 1906లో రెండు వజ్రాలు దొరికాయట. దీంతో వ్యాపారం మొదలెట్టాలని ప్రయత్నించాడు. కాని దొరికిన వజ్రాలు చిన్నగా ఉండటంతో వ్యాపారం కలిసి రాలేదట. దీన్ని 1950లలో పార్క్‌గా మార్చి, సామాన్య ప్రజలకు కూడా ఎంట్రీ కల్పించాడు. అయితే కొద్ది మొత్తంలో మాత్రం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నాడు. మీరూ అమెరికా వెళ్లినపుడు ఓ లుక్కేసి రండి.. ఏమో మీకూ ఓ వజ్రం దొరకావచ్చు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement